రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్‌ అవుతాయా?

4 Dec, 2019 15:07 IST|Sakshi

సాక్షి, అమరావతి : దిశ ఘటనపై  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి మేకతోటి సుచరిత తప్పుబట్టారు. పవన్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. లైంగిన దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు వస్తే  నేరాలు కంట్రోల్‌ అవుతాయా అని ప్రశ్నించారు. ప్రజా నాయకుడిని అని చెప్పుకునే పవన్‌.. ఇలాగేనా మాట్లాడేదని  మండిపడ్డారు. మహిళలంటే పవన్‌కు ఎంత చులకనో ఆయన వ్యాఖ్యలు బట్టే అర్థమవుతుందని విమర్శించారు.

 పవన్‌ లాంటి వారు ఎప్పడైనా అధికారంలోకి వస్తే మహిళలకు ఏం రక్షణ ఉంటుందని నిలదీశారు. దిశ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారని, అందుకే అలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారని చెప్పారు. మహిళల రక్షణ కోసం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకురాబోతున్నామని మంత్రి సుచరిత వెల్లడించారు.

కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై పవన్‌ స్పందిస్తూ.. వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్‌ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు