ఆ కేసులపై పునర్విచారణ చేయిస్తాం : మంత్రి సుచరిత

7 Sep, 2019 20:15 IST|Sakshi

సాక్షి, గుంటూరు : గత ఐదేళ్లలో టీడీపీ నేతలు రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు సృష్టించారని, అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని వేధించారని హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. అక్రమ కేసు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శనివారం ఆమె పల్నాడులోని పిడుగురాళ్ల వాసవీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘చంద్రబాబు ప్రభుత్వ బాధితుల సమావేశా’నికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ... గత టీడీపీ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. దేశంలో ఎక్కడ లేని అరాచకాలు, దారుణాలు పల్నాడులో జరిగాయన్నారు. అధికారం పోయాక వారి అరాచకాలు ఒక్కొక్కటి భయటకు వస్తుండడంతో ఎదురుదాడి ప్రారంభించారని ఆరోపించారు. పెయిడ్‌ ఆర్టీస్టులతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ధర్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలన రాక్షస పాలనకు నిదర్శమన్నారు. యరపతినేతి, కోడెల అక్రమాలను చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అక్రమ కేసు బాధితులకు అండగా ఉంటామని,  ఆ కేసులపై పనర్విచారణ చేయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ బాధితలందరికి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  

చంద్రబాబు అందుకు సిద్ధమా?
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పాలన ప్రశాంతంగా సాగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. దానిని ఓర్చుకోలేకనే టీడీపీ నేతలు  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పల్నాడుకు వస్తే వాస్తవాలు ఏంటో తెలుస్తాయన్నారు. తాను ఒక్కడినే వచ్చి ఇక్కడి పరిస్థితిని చంద్రబాబుకు చూపిస్తానన్నారు.ఎక్కడికైనా చర్చకు సిద్ధమని, చంద్రబాబుకు అందుకు సిద్ధమా అని సవాలు విసిరారు.

మరిన్ని వార్తలు