‘చిన్నబాబుకు మాత్రమే మంత్రి పదవి..’

31 Dec, 2017 11:54 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు. రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన కొడుకు చిన్నబాబుకు మాత్రమే మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. 2017లో బాబు పాలన వైఫల్యనామ సంవత్సరంగా ముగిసిందని రఘువీరా ఎద్దేవా చేశారు.

అంతేకాక బాబు జాబితాలో అన్నీ అపజయాలే అని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో బాబు సర్కారు రైతులను మోసం చేసిందన్నారు. ఇంటికి ఒక్క ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ యువతకు ఇచ్చిన హామీని సైతం అటకెక్కిందన్నారు. ఈ మూడున్నర సంవత్సారాల బాబు పాలనలో ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకో దగ్గ ఐటీ కంపెనీ ఏపీవైపు చూడలేదని ఆయన అన్నారు. తొలుత గూగుల్‌ వంటి కంపెనీలు వస్తాయని  చేసిన ప్రచారం బోగస్‌గా తెలిపోయిందని రఘువీరా పేర్కొన్నారు. 

‘స్వీస్‌ చాలెంజ్‌’ విషయంలోనూ చంద్రబాబు సర్కారుకు చుక్కెదురు అయిందని గుర్తు చేశారు. అంతేకాక ప్రత్యేక ప్యాకేజీ, నోట్ల రద్దు విషయంలో చంద్రబాబు వేసిన పిల్లిమొగ్గలు సొంత పార్టీ నాయకులనే విస్మయానికి గురి చేశాయన్నారు. కాంగ్రెస్‌ హయంలో చిత్తూరు జిల్లాకు వచ్చిన మన్నవరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు కాపాడుకోలేకపోవడం మరో అతిపెద్ద ఫెయిల్యూర్‌ అని రఘువీరా అన్నారు.


 

మరిన్ని వార్తలు