‘తన గొయ్యి తానే తవ్వుకుంటుంది’

4 Jun, 2019 18:03 IST|Sakshi

కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీవ్ర నిరాశకు గురి చేశాయి. బెంగాల్‌లో బీజేపీ ఏకంగా 18 స్థానాల్లో విజయం సాధించి.. దీదీకి గట్టి సవాల్‌ విసిరింది. ఎన్నికలు ముగిసినప్పటికి ఈ రెండు పార్టీల మధ్య విబేధాలు మాత్రం చల్లారడం లేదు. గత కొన్ని రోజులుగా బీజేపీ కార్యకర్తలు మమత ఎదురుగా ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేయడం.. ఆమె వారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో.. బీజేపీ కార్యకర్తల పట్ల మమత అతిగా స్పందిస్తూ.. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు అన్నారు అవార్డు విన్నింగ్‌ నటి అపర్ణా సేన్‌.

రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై అపర్ణ స్పందిస్తూ.. బీజేపీ కార్యకర్తల పట్ల మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరు నాకు నచ్చడం లేదు. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలు జై శ్రీరాం, జై కాళీ మాతా, అల్లా అంటూ ఇలా తమకు నచ్చిన దేవుని పేరు తల్చుకోవచ్చు. ఇది ఈ దేశ ప్రజలుగా వారికున్న హక్కు. మమతా బెనర్జీ ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం దురదృష్టకరం. రాజకీయాలు వేరు.. మతం వేరు. ఈ రెండింటిని కలపి చూస్తే ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. ముఖ్యమంత్రి అయ్యుండి.. బీజేపీ కార్యకర్తల పట్ల ఆమె స్పందిస్తున్న తీరు ఏ మాత్రం బాగాలేదు. దీర్ఘకాలం ఆమె బెంగాల్‌కు సీఎంగా కొనసాగలనుకుంటే.. కంట్రోల్‌గా మాట్లాడాలి’ అని తెలిపారు. ‘దీదీ తీరు ఇలానే కొనసాగితే ఓటర్లను తనకు వ్యతిరేకంగా తానే మార్చుకున్నట్లు అవుతుంది. అదే జరిగితే ఆమె గొయ్యి ఆమె తవ్వుకున్నట్లు అవుతుంది’ అన్నారు అపర్ణా సేన్‌. (చదవండి : దీదీకి తప్పని జై శ్రీరాం సెగ..)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు