ఏపీలోకి సీబీఐ నో ఎంట్రీపై స్పందించిన అరుణ్‌ జైట్లీ

17 Nov, 2018 13:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసేందుకు అనుమతి ఉపసంహరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా సీబీఐకి మోకాలడ్డుతూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై న్యాయవర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఈ విషయంపై స్పందించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించడం లేదని ఆయన అన్నారు. అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికీ సార్వభౌమాధికారం లేదని జైట్లీ స్పష్టం చేశారు. ఏదైనా జరుగుతుందేమోననే భయంతోనే  ఏపీలోకి సీబీఐని రానీయకుండా నిర్ణయం తీసుకున్నారని ఆయన తప్పుబట్టారు.

మరిన్ని వార్తలు