తదుపరి సీఎంలు కూడా వీరే..!

20 Oct, 2018 10:51 IST|Sakshi
అమరిందర్‌ సింగ్‌- కేజ్రీవాల్‌ 9ఫైల్‌ ఫోటో)

పొలిటికల్‌ స్టాక్ ఎక్స్చేంజ్‌ సర్వేలో వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నాయకత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని గత అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌, ఢిల్లీలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీలకు రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలు భ్రమ్మరథం పట్టే అవాకాశం కనిపిస్తోంది. ఈ మేరకు తదుపరి సీఎంగా ఎవ్వరు ఉండాలనే అంశంపై పొలిటికల్‌ స్టాక్ ఎక్స్చేంజ్‌ (పీఎస్‌ఈ) పంజాబ్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో ఓ సర్వేను నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీలో సీఎంగా ఆమ్‌ ఆద్మీ కన్వీనర్‌, ప్రస్తుతం సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు మద్దతుగా 47 శాతం మంది నిచిచారు. గత మూడేళ్లుగా ఢిల్లీలో కేజ్రీవాల్‌ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు ఆమోద ముద్ర వేశారు. చాలా ఏళ్లుగా నీటీ సమస్యతో బాధ పడుతున్న ఢిల్లీ వాసులకు ఆప్‌ ప్రభుత్వం ఈ సమస్యను తీర్చిందని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. రాజధానిని 15 ఏళ్ల పాటు నిరంతరంగా పాలించిన షీలా దీక్షిత్‌ (కాంగ్రెస్‌)పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అమరిందరే కావాలి..
షీలా పాలనతో విసిగిపోయిన ప్రజలు.. ఆమెను తదుపరి సీఎంగా 19 శాతం మంది కావాలనుకుంటున్నట్లు సర్వే తేల్చింది. పరిపాలనలో కూడా ఆప్‌ సరైన మార్పులను తీసుకువచ్చినట్లు పీఎస్‌ఈ ప్రకటించింది. విద్యా, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలక కల్పనలో ఆప్‌ మెరుగైన ఫలితం సాధించింది. ఇక పంజాబ్‌ సీఎంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రస్తుత సీఎం అమరిందర్‌ సింగ్‌కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పంజాబీలు మరోసారి సీఎంగా పట్టంకట్టే అవకాశం ఉన్నట్లు సర్వే తెలిపింది. 42శాతం పంజాబ్‌ ప్రజలు సింగ్‌నే తదుపరి సీఎంగా కోరుకుంటున్నట్లు.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజల్లో మంచి స్పందన ఉందని పీఎస్‌ఈ వెల్లడించింది. కాగా రెండు రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగమే ప్రధాన సమస్యగా ఎత్తిచూపారు. ఉద్యోగాలు కల్పించడంలో కేంద్రంతోపాటు.. రాష్ట్రాలు కూడా విఫలమైయ్యాయని సర్వే తెలిపింది. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఆప్‌ 67 సీట్లల్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
 

దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో తదుపరి ప్రధానిగా ఎవరుండాలనే అంశంపై పీఎస్‌ఈ పలు అంశాలను వెల్లడించింది. 49 శాతం మంది ప్రధానిగా నరేంద్ర మోదీనే కోరుకుంటుండగా.. 43 శాతం మంది రాహుల్‌ గాంధీనే తదుపరి ప్రధాని కావాలని అనుకుంటున్నట్లు సర్వేలో పాల్గన్న వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక దేశ వ్యాప్తంగా బగ్గుమంటున్న పెట్రోల్‌ ధరలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నట్లు.. 8 శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వన్ని వ్యతిరేకిస్తున్నట్లు సర్వే తెలిపింది. 22 శాతం మంది మాత్రం పెట్రోల్‌ ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని తీర్పునిచ్చారు.

మరిన్ని వార్తలు