నామినేషన్‌కు ఆలస్యమైన కేజ్రీవాల్‌.. దాంతో..

20 Jan, 2020 16:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం నామినేషన్‌ వేయలేకపోయారు. ఎలక్షన్‌ కమిషన్‌ కార్యాలయానికి ఆలస్యంగా రావడంతో ఎన్నికల సంఘం అధికారులు ఆయన నామినేషన్‌ పత్రాలను స్వీకరించలేదు. దీంతో మంగళవారం ఆయన మరోసారి ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫీస్‌కు వచ్చి నామినేషన్‌ వేయనున్నారు.

న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసేందుకు బయలుదేరుతూ ఆయన భారీ రోడ్‌షో‌లో పాల్గొన్నారు. తొలుత చారిత్రక వాల్మీకి మందిర్‌లో భగవాన్ వాల్మీకి ఆశీస్సులు తీసుకున్న అనంతరం రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ట్రేట్‌మార్క్ టోపీ, చేతిలో ఆప్ ఐదేళ్ల ప్రోగ్రస్ కార్డును పట్టుకుని కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్, కుమార్తె హర్షిత, కుమారుడు పులకిత్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు రోడ్‌షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆప్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు.

(చదవండి : ఆప్‌ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్‌)

అయితే జనాలు భారీగా తరలిరావడంతో రోడ్‌ షో ఆలస్యంగా ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల కంటే ముందే రావాల్సి ఉండగా... భారీ ర్యాలీ కారణంగా రాలేకపోయారు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు కేజ్రీవాల్‌ నామినేషన్‌ పత్రాలను స్వీకరించలేదు. మంగళవారం వచ్చి నామినేషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మూడు రాజధానులకు పూర్తి మద్దతు : రాపాక

ఎంపీ అర్వింద్‌కు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సవాల్‌

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవం

72 ఏళ్లు గడిచినా రాజధాని లేదు...

స్పీకర్‌ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం

సినిమా

అల్లు అర్జున్‌.. ‘టైటిల్‌’ అది కాదా?

అప్పుడు ‘దొరసాని’.. ఇప్పుడు ‘విధివిలాసం’

సైరా రికార్డును తుడిచేసిన అల..

కృష్ణంరాజు బర్త్‌డే వేడుకల్లో తారలు..

'ఫైటర్'ను బరిలోకి దింపిన పూరి జగన్నాథ్‌

చిన్నారుల కేన్సర్‌ చికిత్సకు ఖర్చు నేను భరిస్తా..

-->