కాంగ్రెస్‌ వైఖరి తెలిసిపోయింది : ఒవైసీ

14 Jun, 2018 18:36 IST|Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం ఇచ్చిన ఇఫ్తార్‌ విందుపై హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ముస్లింలపై కపట ప్రేమను ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ముస్లిం సాధికరతపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. వారు  హిందువుల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

వారం కిందట మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్‌ కార్యక్రమానికి హాజరవ్వడంపై విమర్శలు చేసిన ఒవైసీ.. కాంగ్రెస్‌ ఇఫ్తార్‌ విందుకు ప్రణబ్‌ను ఆహ్వానించడంపై కూడా ఘూటుగానే స్పందించారు. ఈ విందుకు ప్రణబ్‌ని ఆహ్వానించి, గౌరవించడం ద్వారా కాంగ్రెస్‌ వైఖరి ఎంటో స్పష్టంగా తెలుస్తోందన్నారు. కాంగ్రెస్‌ ఇఫ్తార్‌ పేరుతో డ్రామా ఆడుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ రెండేళ్ల విరామం తరువాత ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో పాటు పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు