క్రెడిట్‌ కేటీఆర్‌దే..

27 Aug, 2019 10:58 IST|Sakshi

సిటీ అభివృద్ధిపై ఒవైసీ ట్వీట్‌

ఆయన చొరవతోనే ఇక్కడ బహుళజాతి సంస్థలని కితాబు

కృతజ్ఞతలు తెల్పిన కేటీఆర్‌

సాక్షి, సిటీబ్యూరో: బహుళ జాతి సంస్థల కేంద్రాల ఏర్పాటుతో హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోందని, ఈ  క్రెడిట్‌ అంతా మాజీ మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కొనియాడారు. కేటీఆర్‌ను మళ్లీ ప్రభుత్వంలో చూసేందుకు వేచిచూస్తున్నానంటూ పేర్కొన్నారు. సోమవారం  మొబైల్‌ సంస్థ వన్‌ప్లస్‌ హైదరాబాద్‌లో ఆర్‌ అండ్‌ డీ సంస్థ ప్రారంభించిన సందర్భంగా ఒవైసీ కేటీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్‌ చేశారు. గత ఏడాది ఒప్పో, మొన్న అమెజాన్, తాజాగా వన్‌ప్లస్‌ కేంద్రాలు హైదరాబాద్‌లో కొలువు దీరడంపై ఆయన పై విధంగా స్పందించారు.  ప్రధానంగా లాస్ట్‌ ఇయర్‌ ఒప్పో..గతవారం అమెజాన్‌.. ఇప్పుడు వన్‌ప్లస్‌తో హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోందన్న  జాతీయ మీడియా జర్నలిస్టు ట్వీట్‌పై అసదుద్దీన్‌ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ క్రెడిట్‌ అంతా మాజీ మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. ఒవైసీ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్‌ ఒవైసీకి ధన్యవాదాలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు