టాయిలెట్ల వ్యాఖ్యలపై స్పందించిన ఒవైసీ

22 Jul, 2019 14:53 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు ఎంఐఎం పార్టీ అధినేత, అసదుద్దీన్‌ ఒవైసీ. మమ్మల్ని ఎన్నుకుంది టాయిలెట్లు శుభ్రం చేయడానికి కాదు అంటూ సాధ్వి ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఒవైసీ స్పందిస్తూ.. సాధ్వి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. సాధ్వి ఉన్నత కులానికి చెందిన వ్యక్తి కాబట్టే ఇలా మాట్లాడారని ఆరోపించారు. మరగుదొడ్లు శుభ్రం చేసేవారిని ఆమె తనతో సమానంగా చూడలేకపోతున్నారని.. ఇలాంటి వారు నూతన భారతదేశాన్ని ఎలా సృష్టిస్తారని ఒవైసీ ప్రశ్నించారు.

వర్షాకాలం కావడంతో.. సాధ్వి ప్రాతినిథ్యం వహిస్తోన్న భోపాల్‌ పరిసర ప్రాంతాలు అపరిశ్రుభంగా మారాయి. అయితే ఆ ప్రాంత డ్రైనేజీ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు అక్కడి ప్రజలు. తమ ప్రాంతంలో ఓసారి స్వచ్ఛభారత్‌​ చేపట్టండని ఆమెకి విజ్ఞప్తి చేశారు. దీనిపై సాధ్వి తీవ్రంగా మండి పడుతూ.. ‘ఒకటి గుర్తుంచుకోండి.. నన్ను ఎన్నుకున్నది మురికి కాలువలు, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు కాదు. నన్ను దేనికోసం అయితే ఎన్నుకున్నారో ఆ బాధ్యతల్ని నిజాయతీగా నిర్వర్తిస్తాను. ఒక ఎంపీగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేయడమే నా విధి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు