-

ఇమ్రాన్‌పై ఒవైసీ ఫైర్‌

5 Jan, 2020 09:42 IST|Sakshi

హైదరాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై పోలీసుల దౌర్జన్యం అని ఒక నకిలీ వీడియోను ట్వీట్‌ చేసిన ఇమ్రాన్‌ ఖాన్‌ నెటిజన్లకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఒవైసీ స్పందిస్తూ.. భారత్‌ ముస్లింల గురించి బాధపడేకన్నా.. ముందుగా పాకిస్తాన్‌లో పరిస్థితిని చూసుకోవాలని ఇమ్రాన్‌కు హితవు పలికారు. 

‘బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఘటనను.. భారత్‌లో జరిగినట్టుగా తప్పుడు పోస్ట్‌ చేశాడు. ఇమ్రాన్‌ తొలుత నీ దేశం గురించి నువ్వు ఆలోచించు. భారత ముస్లింలుగా తాము గర్వపడుతున్నామని.. ఎప్పటికీ అలాగే ఉంటామ’ని అసదుద్దీన్‌ స్పష్టం చేశారు.. అలాగే బీజేపీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏ వంటి చట్టాలను తీసుకువస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్‌ఆర్‌సీ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తనను చంపేందుకు కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తున్నాయని.. దమ్ముంటే ముందు తనను చంపాలని సవాలు విసిరారు. 

సిక్కులకు రక్షణ కల్పించాలి : అసదుద్దీన్‌
అలాగే కర్తార్‌పూర్‌లో పాకిస్తాన్‌లోని చారిత్రక నాన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై జరిగిన రాళ్ల దాడిపై అసదుద్దీన్‌ స్పందించారు. సిక్కులకు రక్షణ కల్పించాలని కోరిన అసదుద్దీన్‌.. గురుద్వారా రళ్ల దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు