నెహ్రాజీ.. నిన్ను మిస్సవుతున్నాం!

12 Oct, 2017 15:56 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే నెలలో టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా కెరీర్ రిటైర్మెంట్ దాదాపు ఖరారైన నేపథ్యంలో అతనిపై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది. నవంబర్ లో న్యూజిలాండ్ తో సిరీస్ లో భాగంగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వీడ్కోలు చెప్పడానికి సిద్ధమవుతున్న నెహ్రాను అభిమానులు పొగడ్తలతో కొనియాడుతున్నారు. ప్రధానంగా 38 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానం సంపాదించుకోవడాన్ని ప్రస్తావిస్తూ నెహ్రాను దిగ్గజ బౌలర్లతో పోల్చుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు అభిమానులు.

'నెహ్రాజీ.. నిన్ను కచ్చితంగా మిస్సవుతాం. నీ బౌలింగ్ తో పాటు నీ ఎయిర్ ప్లేన్ సిలబ్రేషన్స్ కూడా ఇక ముందు కనిపించదు అని ఒక అభిమాని ట్వీట్ చేయగా, దాదాపు 40 ఏళ్ల వయసులో జట్టులోకి రావడం చాలా కష్టం..అటువంటిది లేటు వయసులో జట్టులో చోటు సంపాదించిన నెహ్రా ఇక ఫీల్డ్ లో కనిపించడు'అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. దిగ్గజ బౌలర్ కు బ్యాట్లు సాల్యూట్ చేస్తున్నాయి'అని మరో అభిమాని ప్రశంసించాడు.వచ్చే నెల మొదటి వారంలో కెరీర్ కు గుడ్ బై చెప్పడానికి నెహ్రా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ కోహ్లితో పాటు కోచ్ రవిశాస్త్రిలకు తెలియజేసినట్లు బీసీసీఐలోని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. యువకులకు అవకాశం ఇచ్చే క్రమంలో తన వీడ్కోలు ఇదే సరైన సమయంగా నెహ్రా భావించి తన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి తెలిపారు. దాంతో ట్వట్టర్ లో పలువురు అతనిపై అభిమానాన్ని చాటుకుంటున్నారు.

మరిన్ని వార్తలు