‘దళితుడు అయినందుకే ఆయనకు ఆ పదవి వచ్చింది’

17 Apr, 2019 17:59 IST|Sakshi

రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌పై అశోక్‌ గెహ్లోత్‌ వ్యాఖ్య

జైపూర్‌: రెండోవిడత లోక్‌సభ ఎన్నికలకు ఒక్కరోజు ముందు రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలోని దళితుల ఓటు బ్యాంక్‌ కోసమే ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతిగా రామ్‌నాధ్‌ కోవింద్‌కు అవకాశం ఇచ్చారు. 2017లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో దీని ద్వారా లబ్ధిపొందారు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీలో అత్యంత సీనియరైన ఎల్‌కే అద్వానీని పక్కన పెట్టి కేవలం ఓట్ల కోసమే కోవింద్‌ను నియమించారని అశోక్‌ అభిప్రాయపడ్డారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే ఫలితాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్న సందర్భంలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా సలహా మేరకు కోవింద్‌ను రాష్ట్రపతి చేశారని పేర్కొన్నారు.

రామ్‌నాధ్‌ కోవింద్‌ దళితుడు కావడం మూలంగానే రాష్ట్రపతి కాగలికారని అన్నారు. మోదీ-అమిత్‌ షా కుట్రకారణంగానే అద్వానీని తప్పించారని ఆరోపించారు. కాగా బీజేపీలో అద్వానీ స్థానంపై గెహ్లోత్‌ ఇదివరకే పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మోదీ.. అద్వానీ ముక్త బీజేపీ కోసం ప్రయత్నిస్తున్నారని గతంలో పలుమార్లు అన్నారు. కాగా గెహ్లోత్‌ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. దళితులను కించపరిచే విధంగా అశోక్‌ మాట్లాడారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు