దంతేవాడ, పాల, హమీర్‌పూర్‌, బధర్‌ఘాట్‌లో ఉప ఎన్నిక

23 Sep, 2019 09:50 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని 4 రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక కొనసాగుతుంది. చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, కేరళలోని పాల, ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌, త్రిపురలోని బధర్‌ఘాట్‌ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఉప ఎన్నిక నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఈసీ అవసరమైన సంఖ్యలో ఈవీఎంలను, వీవీపాట్‌లను ఎన్నికల కేంద్రాలకు చేర్చింది. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలవుతోంది. పండగలు, ఓట్ల నమోదు, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసీ నేడు ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నటు తెలిపింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. సెప్టెంబర్‌ 27న కౌంటింగ్‌ ఉంటుందని తెలిపింది.

నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన దంతేవాడలో ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఎత్తున బలగాలను మోహరించింది. బీజేపీ నాయకుడు బీమా మందావి నక్సల్స్‌ దాడిలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే భారీ ఎత్తున ప్రజలు ఓటింగ్‌ కేంద్రాలకు చేరుకుని.. క్యూలైన్‌లో నిల్చున్నారు.

పాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన కేరళ కాంగ్రెస్‌ మని వ్యవస్థాపకుడు కేఎం మని ఏప్రిల్‌లో మరణించారు. దాంతో ఈసీ సోమవారం ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తుంది.

యూపీ బధర్‌ఘాట్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే దిలిప్‌ సర్కార్‌ మరణించడంతో ఇక్కడ నేడు ఉప ఎన్నిక జరుగుతుంది.

హమీర్‌పూర్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే అశోక్‌ చందేల్‌ ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో ప్రభుత్వం అతడిని అనర్హుడిగా ప్రకటించింది. దాంతో ప్రస్తుతం హమీర్‌పూర్‌లో ఉప ఎన్నక జరగుతుంది.

మరిన్ని వార్తలు