విశాఖ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చంద్రబాబు కుట్రలు

30 Jan, 2020 19:40 IST|Sakshi

చంద్రబాబును చరిత్ర క్షమించదు

ఏపీకి ఆయువుపట్టు విశాఖ : మంత్రి అవంతి

సాక్షి, విశాఖపట్నం :  విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా టీడీపీ నేతలు బురదజల్లుతున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. పరిపాలనా రాజధానికి విశాఖ అనువైన నగరమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు అమరావతి అభివృద్దికి‌ వ్యతిరేకం‌కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తే చరిత్ర క్షమించదని అవంతి హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఇక్కడ ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. విశాఖపై విషం చిమ్మద్దు’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 


‘విశాఖపై చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారు. ఈ ప్రాంతం పరిపాలనా రాజధాని కాకుండా కుటిలయత్నం చేస్తున్నారు. రాజధానిపై జీఎన్‌న్ రావు కమిటీ సమర్పించిన నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రెండు కళ్ల సిద్దాంతంతో ప్రజలను మోసం చేయవద్దు. వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలిలో చంద్రబాబు ఎలా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. టీడీపీ మూడు గ్రామాల ప్రజల అభివృద్ధికే పరిమితమైంది. అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలనేది మా ప్రభుత్వ లక్క్ష్యం. ఆంధ్రప్రదేశ్‌కు ఆయువుపట్టు విశాఖ నగరం. ఈ ప్రాంతంపై చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష. విశాఖలో పేదలందరికీ  ఇంటి స్థలాలు అందిస్తున్నాం’ అని తెలిపారు.

>
మరిన్ని వార్తలు