అందుకే చెప్పులు వేసుకుంటున్నా: అవంతి

19 Nov, 2019 13:53 IST|Sakshi

సాక్షి, విజయవాడ : తన కంటే అమితంగా హిందూ మతాన్ని ప్రేమించే వాళ్లు ఎవరూ లేరని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. హిందూ మతంలోనే పుట్టాను.. హిందూ మతంలోనే చనిపోతాను అని స్పష్టం చేశారు. అయ్యప్ప మాల వేసుకొని చెప్పులతో నడుస్తున్నారంటూ తనపై వస్తున్న విమర్శలపై మంత్రి స్పందించారు. అనారోగ్య కారణాల వల్లే చెప్పులు వేసుకొంటున్నానని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా.. మాల వేసుకొని చెప్పులతో నడిచానన్నారు. ఆ పార్టీ నేత మురళీమోహన్ కూడా మాలలో చెప్పులు వేసుకొంటారన్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే చంద్రబాబు మాత్రం మతాన్ని రాజకీయానికి వాడుకుంటూ తనపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. టీడీపీలో ఉన్నపుడు మాలలో పవిత్రంగా ఉన్న తాను.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిన తర్వాత అపవిత్రుడినయ్యానా అని ప్రశ్నించారు. 

అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై చంద్రబాబు చేస్తున్న విమర్శలపై మంత్రి స్పందించారు. ఇంగ్లీషు మీడియం అంశంపై రాద్ధాంతం చేయడం ఆయనకు తగదని హితవు పలికారు. చంద్రబాబు కుమారుడు లోకేష్‌, మనవడు దేవాన్ష్‌ ఇంగ్లీషు మీడియంలో చదువుకోవచ్చు గానీ.. పేద పిల్లలు ఇంగ్లీషులో చదవకూడదా అని ప్రశ్నలు సంధించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రజలను క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ

మున్సిప‌ల్ కార్మికుల‌పై హ‌రీష్‌రావు ఆగ్ర‌హం

మోదీ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు : సోనియా

ఇప్పుడూ నీచ రాజకీయాలా?

బలపరీక్ష నెగ్గిన చౌహాన్‌ 

సినిమా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు