‘నీతి నిజాయితీ ఉంటే డీజీపీకి ఫిర్యాదు చేయాలి’

19 Mar, 2020 15:14 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు తనకు అనుకూలమైన వారితో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజులు సమయం ఉంటే ఎన్నికలు పూర్తయ్యేవి అని ఆయన తెలిపారు. కోర్టు చెప్పిన తీర్పును చంద్రబాబు వక్రీకరిస్తున్నారని అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఎన్నికలు వాయిదా వేసి, ఎన్నికల కోడ్‌ను ఎలా కొనసాగిస్తారని ఎలక్షన్‌ కమిషన్‌ను ప్రశ్నిందన్నారు. గ్లోబల్‌ ప్రచారం చేసి స్థానిక ఎన్నికలు వాయిదా వేయించారని అవంతి మండిపడ్డారు. నకిలీ లేఖను సృష్టించి, ఎన్నికల కమిషన్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి రాశారని ఆయన ధ్వజమెత్తారు. (పచ్చ మీడియాకు లెటర్‌ ఎందుకు పంపారు!)

నిమ్మగడ్డ రమేష్ తనకు ఆ లేఖతో సంబంధం లేదని చెబుతున్నారు, కానీ ఆయనకు నీతి నిజాయితీ ఉంటే దీనిపైన డీజీపీకి ఫిర్యాదు చేసి లేఖ రాసిన వారిమీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరాలన్నారు. ఆ లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని అవంతి శ్రీనివాస్‌ ఆగ్రహించారు. గ్రూప్ మీటింగ్ పెట్టొద్దని ఎన్నికల కమిషన్ చెప్పిందని చంద్రబాబు అంటున్నారు. కానీ అమరావతిలో మీరు ఎలా ధర్నాలు చేస్తున్నారని ఆవంతి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు మనస్తత్వం మార్చుకుని దుష్ప్రచారం చేయడం మానుకోవాలని అవంతి హితవు పలికారు. చంద్రబాబు రాష్ట్రం పరువు  ప్రతిష్టలు, బ్రాండ్ ఇమేజ్ పోయే విధంగా చేస్తున్నారని అవంతి శ్రీనివాస్‌ దుయ్యబాట్టారు. (ఎన్నాళ్లు తప్పించుకుంటావ్ బాబూ?)

మరిన్ని వార్తలు