దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది: అవంతి

26 May, 2020 19:13 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: రైతులకు కరెంటు దండగా అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంటే దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంటు అందించారని పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు హాయాంలో సీఎంను కలవాలంటే సూటు.. బూటు వేసుకుని సింగపూర్‌ నుంచి రావాలని ఆయన ఎద్దేవా చేశారు. ఇక వైఎసార్‌ రైతు భరోసా ద్వారా సంవత్సరానికి రైతులకు రూ. 13500 పెట్టుబడి సాయం అందిందని తెలిపారు. దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, కరోనా సమయంలో 14 వేల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ జరిగిందని వెల్లడించారు. అంతేగాక ఇమాములు, పూజారులు, చర్చి ప్రతినిధులకు రూ. కోటి 70 లక్షల సహాయం అందించినట్లు తెలిపారు. (‘వారిద్దరూ రాజకీయ వ్యాపారులు’)

గత ప్రభుత్వం మత్స్యకారులను ఓటు బ్యాంకుగా చూశారని మంత్రి వ్యాఖ్యానించారు. మత్స్య వేట నిషేధ కాలంలో ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని రూ. 4 వేల నుంచి రూ. 10 వేలకు పెంచినట్లు చెప్పారు. కోవిడ్-19 సమయంలో కూడా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగించారన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఈ నెల 30న ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా రూ. 3 లక్షల ఎకరాల భూమికి నీరు అందనుందని, మార్కెటింగ్ కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. వలసలు లేకుండా గ్రామాల్లోనే ప్రజలు ఉండేలా సీఎం జగన్ పథకాలు రూపొందించారని చెప్పారు. రైతు గర్వ పడేలా సీఎం జగన్‌ చర్యలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ('సుధాకర్‌ విషయంలో టీడీపీది మొసలి కన్నీరు')

మరిన్ని వార్తలు