తండ్రి బాటలో తనయుడు..

16 Apr, 2019 18:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జయప్రదపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎస్పీ నేత ఆజం ఖాన్‌పై ఈసీ చర్యలు చేపట్టిన మరుసటి రోజే ఆయన కుమారుడు అబ్ధుల్లా ఆజం ఖాన్‌ ముస్లిం కార్డు ముందుకు తెచ్చారు. తన మతం కారణంగానే తమ తండ్రిపై ఈసీ చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. తన తండ్రి ఎన్నికల ప్రచారంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకునే క్రమంలో ఈసీ ఎలాంటి పద్ధతులూ పాటించలేదని ఆయన ఆక్షేపించారు.

తన తండ్రిని మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయరాదంటూ ఈసీ నిషేధించే ముందు నోటీసులూ జారీ చేయలేదని ఆరోపించారు. ఆయన ముస్లిం అయినందుకే ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించారా అంటూ అబ్ధుల్లా ఆజం ఖాన్‌ నిలదీశారు. విపక్షాల గొంతు నొక్కడం ద్వారా వారిని అణిచివేయలేరని అన్నారు. కాగా, యూపీలోని రాంపూర్‌లో ఈనెల 15న ఓ ర్యాలీలో ఆజం ఖాన్‌ మాట్లాడుతూ జయప్రదను ఉద్దేశించి చేసిన ఖాకీ నిక్కర్‌ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు