బాబు తీరు రాష్ట్రానికి శాపంగా మారింది: కేవీపీ

22 Jan, 2018 13:13 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారు.. ఆయన తీరు రాష్ట్రానికి శాపంగా మారిందని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఈమేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. నాలుగేళ్లయినా విభజన చట్టంలోని హామీలను అమలు చేయించుకోలేకపోయారన్నారు. దోపిడీ వాటాలు కుదరక ప్రాజెక్టులు ఆలస్యం చేస్తున్నారని, అమరావతి లో శాశ్వత భవనాలకు ఇటుక పేర్చలేదని విమర్శించారు. విభజన చట్టం హామీల‌పై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. చివరి నిమిషంలో బిజెపిపై నిందలేస్తే ప్రజలు క్షమించరని హితవు పలికారు. ఆస్పత్రి ‌పేర దుబాయ్ కంపెనీకి భూములు ఇవ్వడంలో ఉన్న ఆసక్తి ఎయిమ్స్ నిర్మాణంపై లేదని, కాంట్రాక్టర్ల రేట్ల కోసం కేంద్రంతో తగాదాపడడం విడ్డూరంగా ఉందని కేవీపీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హెరిటేజ్‌, బిగ్‌బజార్ ప్రయోజనాల కోసం రాజీపడుతున్నారని ఆరోపించారు. విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదంటూ టీడీపీ కూడా రెండుసార్లు విభజన లేఖలు ఇచ్చిందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు