టీడీపీది అరాచక పాలన

12 Mar, 2019 12:56 IST|Sakshi
నవరత్నాలపై ప్రచారం చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి

ప్రతి ఇంట్లో చర్చించాలి

మన వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకోవడానికి చంద్రబాబు ఎవరు?

600 హామీలు విస్మరించిన చంద్రబాబు

ప్రతి ఒక్కరూ ఓటు గురించి తెలుసుకోవాలి

రావాలి జగన్‌–కావాలి జగన్‌లో మాజీ మంత్రి బాలినేని

ఒంగోలు సిటీ: టీడీపీ అరాచక పాలన చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక ఆరో డివిజన్‌లో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా నవరత్నాలపై ఇంటింటికీ ప్రచారం చేశారు. డివిజన్‌ అధ్యక్షుడు జమ్ము శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. బాలినేని మాట్లాడుతూ అయిదేళ్లు టీడీపీ అరాచక పాలన చేసిందని వివరించారు. ప్రతి ఇంట్లో చంద్రబాబు అరాచక పాలన గురించి చర్చించాలన్నారు. ఈ ఎన్నికల్లో గతంలో చేసిన తప్పునే మళ్లీ చేయకుండా బాబు దుర్మార్గాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గత ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల అమలుపై చర్చించాలని అన్నారు.

బీసీలను ఎలా దగా చేశారో ప్రతి కుటుంబం ఆలోచించాలని తెలిపారు. మన ఆధార్‌ డేటాతో సహా వ్యక్తిగత సమాచారాన్ని తమ తాబేదారు కంపెనీలకు అమ్ము కోవడానికి చంద్రబాబు ఎవరని ప్రతిచోటా చర్చ జరగాలన్నారు. వైఎస్సార్‌ సీపీకి ఎన్నికల్లో మద్దతు పలకాలని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఒక అవకాశం ఇవ్వమన్నారు. రాష్టంతోపాటు ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందని అన్నారు. నేడు మన పిల్లల్ని చదివించుకోవడానికి ఎందుకు అప్పుల పాలవుతున్నామో ప్రతి ఇంటా చర్చ జరగాలని అన్నారు. రోగం వస్తే ఆస్తులను తెగనమ్ముకోవాల్సిన దుస్థితిపై లోతుగా చర్చించి ఓటు వేయాలన్నారు. పొదుపు మహిళల రుణాలను మాఫీ  చేయలేదని వివరించారు. పసుపు–కుంకుమ పేరుతో మూడు వేలు ఇచ్చి సరిపెట్టారన్నారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. ప్రతి పొదుపు మహిళ ఆలోచించాలని కోరారు. నేడు పింఛన్‌ రూ.2 వేలు ఇస్తున్నారంటే జగన్‌ వల్లే కదా అని గుర్తించాలన్నారు. జగన్‌ సీఎం అయితే పింఛన్‌ రూ.3 వేలు ఇస్తారని అన్నారు. బీసీలకు ప్రత్యేకించి జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చారన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో యాభైశా తం బీసీలకే నని అన్నారు. నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తామని అన్నారు.

ఓటర్లు చెక్‌ చేసుకోండి
ఓటర్లు మీ ఓటు ఉందో లేదో జాబితాలో చూసుకోండన్నారు. 1950 ఎన్నికల సంఘం టోల్‌ప్రీ ద్వారా వివరాలను తెలుసుకోండని అన్నారు. ఓటు లేని వారు ఉంటే ఈ నాలుగు రోజుల్లో ఈసీఐ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తగా ఓటరుగా నమోదు కావాలని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గుర్రం వెంకయ్య, వెలనాటి మాధవ. యనమల నాగరాజు, కొఠారి రామచంద్రరావు, ఎందేటి రంగారావు, ఎందేటి వెంకట్రావు, పటాపంజుల శ్రీను, కటారి సంజీవ్, పందరబోయిన పున్నారావు, సాయి,పూరిమిట్ల హర్నాద్, పులుగు అక్కిరెడ్డి, ఆంజనేయులు, కుప్పం ప్రసాద్, బట్టు శ్రీను, కావటి రవి, జలీల్, మహిళా నాయకులు మల్లమ్మ, కృష్ణవేణి, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు