బాబు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు: మంత్రి బాలినేని

14 Feb, 2020 12:15 IST|Sakshi
ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

సాక్షి, నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇప్పడు నిజమవుతున్నాయని మాజీ ఆర్థికశాఖ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గత వారం రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన జిల్లాలో మాట్లాడుతూ.. అవినీతి కేసుల్లో విచారణను తప్పించుకునేందుకే కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. నిత్యం మీడియా సమావేశాలు పెట్టి హడావిడి చేసే చంద్రబాబు.. ఎక్కడ దాక్కున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాజీ కార్యదర్శికి అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చామని ప్రశ్నించారు. మాజీ కార్యదర్శి శ్రీనివాస్‌తోపాటు టీడీపీ నేతల వెనక ఎవరున్నారో అందరికీ తెలుసని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. (‘ఇది ఉల్లిపాయపై పొర మాత్రమే’)



మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి

ప్రకాశం: చంద్రబాబు అండ్‌ కో రూ. 2 వేల కోట్లు దోపిడి చేసి టీడీపీ నేతలు కిక్కురుమనడం లేదని  విద్యుత్‌, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి మండిపడ్డారు. టీటికి మాటికి పిచ్చి రాతలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడుకి రూ.2 వేల కోట్ల స్కాం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. స్కాం వివరాలు బయటపడ్డాక చంద్రబాబు, లోకేష్‌ నోర్లు మూత పడ్డాయా అని నిలదీశారు. ఒక్క సీఏ దగ్గరే రెండు వేల కోట్ల స్కాం బయటపడితే.. ఇక చంద్రబాబు అవినీతి ఎన్ని వేల కోట్లు ఉంటుందన్నారు. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. స్కాంలో బాబు పాత్ర కూడా ఉందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని బాబు అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. (రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం!)



ఎమ్మెల్యే కిలారి రోశయ్య

గుంటూరు : చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య విమర్శించారు. నిప్పు అని చెప్పుకునే బాబు ఇప్పుడేం చెప్తారని ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. పరిపాలన అందించాలని ప్రజలు అయిదేళ్లు బాబుకు అధికారం అందిస్తే ఆయన రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం : వానపాము లాంటి‌వారిపైన ఐటీ దాడులు జరిగితేనే రెండువేల కోట్లు బయటపడ్డాయంటే.. అనకొండ లాంటి చంద్రబాబు మీద విచారణ జరిపితే లక్షల కోట్లు బయటపడతాయని కేంద్ర మాజీ మం‍త్రి కిల్లి కృసారాణీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమరావతి గ్రాఫిక్స్ చూపించి చంద్రబాబు లక్షల కోట్లు ప్రజాధనం లూటీ చేశారని తాము చెప్పింది నిజమవుతుందని అన్నారు. డొల్ల కంపెనీలు సృష్టి, అక్రమ మార్గంలో రాష్ట్ర ప్రజల సొమ్ము విదేశాలకు తరలింపులో చంద్రబాబు పాత్రే కీలకమని విమర్శించారు.

చదవండి : పెళ్లితో ఒక్కటైన ఇద్దరమ్మాయిలు

మరిన్ని వార్తలు