ఎన్నికల వాయిదా కుట్ర: మంత్రి బాలినేని

15 Mar, 2020 16:31 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా ఒక కుట్ర అని మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని, ఎన్నికల కమిషన్‌ నిర్ణయం వల్ల 14వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని మంత్రి బాలినేని అన్నారు. (ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా)

ఎన్నికల కమిషనర్‌ ...చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నారనే అనుమానాలు బలపడ్డాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి సీఎం జగన్‌ ...ఎన్నికల కమిషనర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని కోరారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించే వ్యక్తిని కమిషనర్‌గా నియమించాలని మంత్రి బాలినేని డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. (రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై సీఎం జగన్ ఆగ్రహం)

మరిన్ని వార్తలు