కాంగ్రెస్‌ నేతలకు కడుపుమంట

4 Sep, 2018 02:01 IST|Sakshi

రాహుల్, సోనియాలతో ఇంతపెద్ద సభ పెట్టగలరా?

బాల్క సుమన్, జీవన్‌రెడ్డి విమర్శ

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ బహిరంగసభ పెడితే కాంగ్రెస్‌ నేతలకు భయంతో, బాధతో కడుపు మం డుతున్నట్టు ఉందని ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడిక్కడ విలేకరులతో వారు మాట్లాడుతూ, సభ విజయవం తం కావడంతో భవిష్యత్తు అంధకారమైన కాంగ్రెస్‌ నేతలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో కొత్త బిచ్చగాడు రేవంత్‌రెడ్డి, పాత బిచ్చగాడు మధుయాష్కీ, గడ్డం బాబా ఉత్తమ్, బొమ్మాళి డీకే అరుణ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సుమన్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ సభలలో పల్లీలు, వాటర్‌ పాకెట్లు అమ్ముకునే వారి సంఖ్యకన్నా ఇటీవల రాహుల్‌గాంధీతో కాంగ్రెస్‌ పార్టీ పెట్టుకున్న సభలో తక్కువ జనం ఉన్నారని వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్‌పై తిట్లు, శాపనార్ధాలు ఆపకుంటే కాంగ్రెస్‌ పార్టీ సింగిల్‌ డిజిట్‌ సీట్లకే పరిమితం అవుతుందని, చాలామందికి డిపాజిట్లు రావని హెచ్చరించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్‌ ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌కు అధికారంలో లేకుంటే నిరుద్యోగులు గుర్తుకువస్తారా అని సుమన్‌ ప్రశ్నిం చారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, సభ విజయవంతం కావడంతో వారికి భయం పట్టుకుందన్నారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీతో ఇంత పెద్ద సభ పెట్టగలరా అని సవాల్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ, ఐటీఐఆర్‌ విషయంలో కాంగ్రెస్‌ నేతలు క్షమాపణ చెప్పాలని, వారి అసమర్థత వల్లనే ఐటీఐఆర్‌ రాకుండా పోయిందన్నారు.  

మరిన్ని వార్తలు