దళితుల ద్రోహి నెహ్రూ కుటుంబమే: దత్తాత్రేయ

11 Aug, 2018 02:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని అత్యధిక కాలం పాలిం చిన ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్‌ పార్టీయే దళిత ద్రోహి అని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. దళితుల సంక్షేమం విషయంలో బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ ఆ చరిత్ర తెలుసుకోవాలన్నారు.

శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో దళితులపై జరిగిన దాడులు ఎన్నడూ జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, వేధింపుల నిరోధక సవరణ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించిన మోదీ ప్రభుత్వాన్ని దళితుల సంక్షేమంపై ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర సచి వాలయం నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ సానుకూలంగా ఉందని చెప్పారు.  

పంచాయతీ ఎన్నికలకు ఆదేశాల్విండి..
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలను తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక కోరింది. దత్తాత్రేయ ఆధ్వర్యంలో వేదిక ప్రతినిధులు కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, సరోజ తదితరులు కేంద్ర మంత్రిని కలసి ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదని, అధికారాల బదలాయింపు కూడా జరగడం లేదని వివరించారు. 

మరిన్ని వార్తలు