‘బాబు నైతికంగా మండలి రద్దు ఒప్పుకున్నాడు’

27 Jan, 2020 15:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అసెంబ్లీలో శాసన మండలి రద్దు బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని.. బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నైతికంగా మండలి రద్దు ఒప్పుకున్నారని తెలిపారు.1985లో ఎన్టీఆర్ మండలిని రద్దు చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించలేదని నాగేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మండలి అవసరం లేదని.. అనవసరపు ఖర్చని ఆనాడు చంద్రబాబు అన్నాడని మండిపడ్డారు. సలహాలు, సూచలనలు ఇవ్వాల్సిన పెద్దలసభను చంద్రబాబు అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. రౌడీ ప్రవర్తన ఉన్న తన ఎమ్మెల్సీలతో చంద్రబాబు మండలిని నింపారని నాగేశ్వరరావు ఆరోపించారు. బిల్లును మండలికి పంపితే వెనక్కి పంపుతూ ప్రజాస్వామ్యం విలువలను దిగజారుస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయ చరిత్రలో మాజీ సీఎం శాసనమండలి గ్యాలరీలో కూర్చుని మండలి చైర్మన్‌ను ప్రభావితం చేసిన సంఘనలు ఎక్కడా చూడలేదన్నారు. చదవండి: బినామీలను కాపాడుకునేందుకే బాబు తాపత్రయం

ప్రజలకు మంచి చట్టాలను తీసుకురావడంలో జాప్యాన్ని గ్రహించిన సీఎం జగన్‌ మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. మండలి నిర్వహణ రాష్ట్రనికి అనవసర ఖర్చుతో పాటు ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. ప్రజలకు ఉపయోపడే బిల్లులను మండలిలో అడ్డుకోవడం హేయమైన చర్య అని నాగేశ్వరరావు విమర్శించారు. టీడీపీ రాజకీయ ఉగ్రవాదంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో రాజాకీయ నిరుద్యోగిగా మారి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. చంద్రబాబు 23 సీట్లుకే కాకుండా 23 పంచాయతీలకు నాయకుడిగా పరిమితమయ్యాడని ఆయన ఎద్దేవా చేశారు. చదవండి: అందుకే చంద్రబాబు సభకు రాలేదు

151 సీట్లు ఉన్న ప్రభుత్వం చేస్తున్న చట్టాలను మండలిలో వ్యతిరేకించడం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడవడమే అని నాగేశ్వర రావు మం‍డిపడ్డారు. శాసన మండలి నిర్వహించటం అంటే రాజకీయ నిరుద్యోగులను ప్రోత్సహించడమే అని ఆయన పేర్కొన్నారు. 5 కోట్ల ప్రజలు శాసనసభ మండలి రద్దుపై హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు శాసనసభ మండలి రద్దును గ్రహించి.. సభ్యులకు అవినీతితో సంపాదించిన సొమ్ము జీతం రూపంలో ఇస్తానని హామీ ఇచ్చారని నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ హామీతో చంద్రబాబు అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో మండలి రద్దును బలపపిర్చిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు