నేడు బీసీ సింహగర్జన సభ

4 Nov, 2018 02:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీ సంక్షేమ సంఘం నిర్వహించనున్న బీసీ సింహగర్జన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సరూర్‌నగర్‌ స్టేడియంలో సభ ప్రారం భం కానుంది. ఎన్నికలు సమీపించిన తరుణం లో భారీ ఎత్తున తలపెట్టిన ఈ సింహగర్జనకు ప్రాధాన్యం ఏర్పడింది.

జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు, సంక్షేమ ఫలాలు అందించాలనే డిమాండ్‌ను బీసీ సంఘాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయని, ప్రస్తుతం ఎన్నికలు నేపథ్యంలో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో బీసీ డిమాండ్లు చేర్పించాలనే లక్ష్యంతో సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. బీసీలకు 50శాతం సీట్లు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేంతవరకు ఉద్యమాన్ని ఆపబోమన్నారు.

మరిన్ని వార్తలు