బెంగాల్‌: లేడీస్‌ దంగల్‌

14 Mar, 2019 09:15 IST|Sakshi

సాక్షి, కోల్‌కతా: 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 60 మంది మహిళా సభ్యులు గెలుపొందగా, అందులో 12 మంది అంటే 20 శాతం మంది పశ్చిమ బెంగాల్‌ నుంచే కావడం గమనార్హం. దేశంలో బెంగాలీల జనాభా శాతానికి ఇది రెట్టింపు కన్నా అధికం. తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన మహిళా అభ్యర్థుల్లో 30 శాతానికి పైగా మంది గెలుపొందారు. తృణమూల్‌కు చెందిన ఉమా సోరెన్‌ అత్యంత పేద సభ్యురాలు. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.5 లక్షల కన్నా తక్కువే. గతంలో కన్నా 2014లోనే అత్యధిక సంఖ్యలో మహిళా సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్‌ 41 శాతం సీట్లను మహిళలకే కేటాయించిన సంగతి తెలిసిందే.   

మరిన్ని వార్తలు