ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు షాక్‌!

14 Oct, 2018 04:08 IST|Sakshi

బిలాస్‌పూర్‌: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రామ్‌దయాళ్‌ ఉయికె బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర అణచివేతను భరించలేకే తిరిగి సొంతగూటికి వచ్చానన్నారు. రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ధరమ్‌లాల్‌  సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే ఉయికె బిలాస్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ తీవ్ర అణచివేతకు గురయ్యా. సిద్ధాంతాలు, ఆశయాలను ఆ పార్టీ విస్మరించింది.

అశ్లీల సీడీ రాజకీయాలతో రాష్ట్ర అధ్యక్షుడు భూపేశ్‌ బఘేల్‌ పార్టీ ప్రతిష్టను దిగజార్చారు. ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, పేద ప్రజలను కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేయడంతో ఎస్టీ వర్గానికి చెందిన వాడిగా ఎంతో ఆవేదనకు గురయ్యా’ అని తెలిపారు. ఓ మహిళతో రాష్ట్ర మంత్రి రాజేశ్‌ మునత్‌ రాసలీలలు నెరుపుతున్న సీడీ బహిర్గతం కావడం వెనుక సూత్రధారిగా సీబీఐ పేర్కొంటున్న వారిలో రాష్ట్ర అధ్యక్షుడు భూపేశ్‌ బఘేల్‌ కూడా ఒకరు. 2000వ సంవత్సరంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉయికె.. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలైన పాలి–తనఖార్‌ లేదా మర్వాహిల నుంచి ఉయికెను బీజేపీ పోటీలోకి దించే చాన్సుంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా