రాజ్యసభకు ఇద్దరు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

1 Jun, 2019 09:30 IST|Sakshi

గువాహటి: అస్సాం నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగి సింది. ఈ సీట్లను బీజేపీ, మిత్రపక్షం ఏజీపీ (అసోం గణపరిషత్‌) దక్కించుకున్నాయి. అసోం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్‌కే చెందిన మరో సభ్యుడు సాంటియుస్‌ కుజుర్‌ల పదవీ కాలం జూన్‌ 14తో ముగియనుంది. ఈ 2 స్థానాలకు జూన్‌ 7న ఎన్నిక జరపాల్సి ఉండగా నామినేషన్‌ దాఖలు శుక్రవారంతో గడువు ముగిసింది. ఇద్దరే నామినేషన్లు దాఖలు చేశారని ఆర్వో తెలిపారు.

దీంతో నామినేషన్‌ వేసిన బీజేపీ సభ్యుడు కామాఖ్య ప్రసాద్‌ తాసా, ఏజీపీకి చెందిన బీరేంద్ర ప్రసాద్‌ వైశ్య ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అసోం నుంచి 1991 నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ తరఫున వరసగా ఎన్నికవుతున్నారు. ప్రస్తుతం అసోం అసెంబ్లీలో సరిపడా బలం లేకపోవడంతో కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌ తమ అభ్యర్థులను బరిలో ఉంచలేదు. 

మరిన్ని వార్తలు