టీడీపీ దివాళాకోరు తనానికి నిదర్శనం: బీజేపీ

14 Feb, 2020 13:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ : చంద్రబాబు పాలనలో అవినీతి జరిగిందని తాము గతంలోనే చెప్పామని బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా పేర్కొన్నారు. తాజాగా ఐటీ దాడుల ద్వారా అది నిజమని నిరూపితమైందన్నారు. విజయవాడలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన వారు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు చేసిన అవినీతి నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పీఎస్ దగ్గరే రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయంటే, ఇక చంద్రబాబు ఎన్ని లక్షల అవినీతి చేసివుంటారోనని అన్నారు. తన అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో సీబీఐని రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. అవినీతిపరుల అక్రమార్జనను కేంద్రం పైసాతో సహా కేంద్ర ఖజానాలో జమచేస్తుందన్నారు. (బాబు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు: మంత్రి బాలినేని)

రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి
చంద్రబాబు ఆయన బినామీలు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీజీపీ అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ అన్నారు. చంద్రబాబు అవినీతిపై కూడా విచారణ జరుగుతుందని, చంద్రబాబు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాబు అవినీతిపై విచారణ కోరాలని, ఐటీ దాడులు రాజకీయ కక్ష్యతో జరుగుతున్నయని టీడీపీ నేతలు మాట్లాడడం వారి దివాళాకోరు తనానికి నిదర్శనమని తెలిపారు. దాడులు చేసేది బీజేపీ కాదని ఐటీ అధికారులని స్పష్టం చేశారు. చంద్రబాబు అవినీతి సొమ్ము ప్రజలకు చేరాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని కోరారు. (దిశ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..)

రాజకీయాల్లో అత్యంత అవినీతిపరుడు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముద్రించిన "ఎంపరర్ ఆఫ్ కరప్షన్ చంద్రబాబు" ఆధారంగా అన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ మొదలు పెట్టాలని కాంగ్రెస్ నేత డాక్టర్ గంగాధర్ డిమాండ్‌ చేశారు. రాజకీయాలు భ్రష్టు పట్టించిన వ్యక్తి, అవినీతి మయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రాజకీయాల్లో అత్యంత అవినీతిపరుడు, దేశంలోనే చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ తక్షణమే విచారణ చేపట్టి చంద్రబాబు అవినీతి గుట్టు విప్పాలని కాంగ్రెస్ నేత నరహరిశెట్టి నరసింహరావు సూచించారు. దామోదరం సంజీవయ్య లాంటి సాధారణ జీవితం గడిపిన సీఎంగా చేసిన చరిత్ర ఏపీకి ఉందని.. ఆయన పుట్టిన రోజున ఒక అత్యంత అవినీతి మాజీ సీఎం చంద్రబాబు చిట్టా వెలుగులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు