‘కర్ణాటక రక్తమోడినా వారు పట్టించుకోరు’

28 May, 2018 14:12 IST|Sakshi
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, బెంగళూరు : ప్రజల దయతో తానుముఖ్యమంత్రి కాలేదని, కాంగ్రెస్‌ పార్టీ వల్లే తనకు పదవి దక్కిందంటూ.. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ‘నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా ఎన్నికైన హెచ్‌డీ కుమారస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను ఎగతాళి చేశాయి. ఆరు కోట్ల కన్నడ ప్రజలకన్నా.. కాంగ్రెస్‌ పార్టీయే తనకు ముఖ్యమని ఆయన వ్యాఖ్యలు నిరూపించాయి. కాంగ్రెస్‌ పెద్దల మెప్పు పొందేందుకు ఆయన ఏమైనా చేసేలా ఉన్నారంటూ’  కర్ణాటక బీజేపీ ట్విటర్‌ వేదికగా సీఎం కుమారస్వామిపై విమర్శలు చేసింది.

‘ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యాఖ్యలు మరేమీ ఉండవు. ముఖ్యమంత్రే ప్రజలకు సేవ చేయడానికి కాకుండా.. తనకు అధికారం కట్టబెట్టిన పార్టీకి విధేయులుగా ఉండాలనుకుంటున్నారు. ఇలా అయితే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందో. కర్ణాటక రక్తమోడినా సరే.. కాంగ్రెస్‌- జేడీఎస్‌లు వారి పెట్టెలు నింపుకోవడంలోనే నిమగ్నమై పోతారంటూ’  బీజేపీ ఐటీ సెల్‌ ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా