నిమ్మగడ్డతో రహస్య భేటీపై బీజేపీ అసంతృప్తి

23 Jun, 2020 15:20 IST|Sakshi

ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్ర చేయడం సరికాదు : బీజేపీ సీనియర్‌ నేత

సాక్షి, న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరి భేటీ కావడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం సరికాదని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు.నిమ్మగడ్డ వ్యవహరంపై బహిరంగంగా పోరాటం చేయమన్నామే తప్ప కుట్రలు చేయమని చెప్పలేదన్నారు. హోటళ్లలో రాజకీయ నేతలలతో చర్చించాల్సిన అవసరం నిమ్మగడ్డకు ఏంటని ప్రశ్నించారు. నిమ్మగడ్డ విశ్వసనీయతపై ప్రశ్నలు వచ్చిన సమయంలో ఈ భేటీలు దేనికి నిదర్శనమని నిలదీశారు. మొదటి నుంచి ఆకాశ చంద్రన్న ఉత్తరాలతో నిమ్మగడ్డ అనుమానస్పదంగా ఉన్నారని, హోటల్‌ భేటీతో ఇది రుజువైందని సదరు నేత వ్యాఖ్యానించారు.(ఇద్దరు నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ)

కాగా, మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌‌లో ఈ భేటీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో రికార్డులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు