చాయ్‌, పకోడా మాటలు అందుకే..

18 Feb, 2018 15:03 IST|Sakshi
బీజేపీ పకోడా వ్యాఖ్యలపై అఖిలేష్‌ అభ్యంతరం

సాక్షి, లక్నో : మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చాయ్‌, పకోడాలను తెరపైకి తెస్తున్నదని యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. అభివృద్ధిపై చర్చ జరగడం ఇష్టం లేని కేంద్ర, రాష్ర్ట బీజేపీ ప్రభుత్వాలు చాయ్‌, పకోడా అంటూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని అన్నారు. గోరఖ్‌పూర్‌ లోక్‌సభ బైపోల్స్‌లో జాతికి మెరుగైన సందేశాన్ని పంపాలని ఆయన ఓటర్లను కోరారు.

యూపీ సీఎంగా ఎన్నికైన అనంతరం యోగి ఆదిత్యానాథ్‌ గోరఖ్‌పూర్‌ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గోరఖ్‌పూర్‌ నుంచి యోగి ఆదిత్యానాథ్‌ వరుసగా అయిదుసార్లు ఎంపీగా గెలుపొందారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిపై యోగి పలుమార్లు విజయం సాధించడంతో అక్కడ బీజేపీ, ఎస్‌పీ మధ్యే గట్టిపోటీ నెలకొంది. కాంగ్రెస్‌ ఇప్పటికే ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థిని ప్రకటించింది.

ఇక డిప్యూటీ సీఎంగా ఎన్నికైన కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ప్రాతినిథ్యం వహిస్తున్న పూల్పూర్‌ పార్లమెంట్‌ స్ధానానికీ ఉప ఎన్నికలు జరగనుఆన్నయి. ఇక్కడ నుంచి మనీష్‌ మిశ్రాను కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.

మరిన్ని వార్తలు