గ్రామాల వైపు.. కమలనాథుల చూపు

6 Aug, 2018 01:05 IST|Sakshi

సంస్థాగతంగా బలోపేతంపై బీజేపీ దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు సమీపిస్తుండటంతో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని పార్టీ కేడర్‌ను కదిలించే ప్రయత్నం చేస్తోంది. దీంతో పాటు నగరాలు, పట్టణాల్లో కూడా బస్తీబాట పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. బస్తీబాట కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమవ్వగా.. పార్టీ నేతలకు ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లాలని రాష్ట్ర నాయకత్వం నుంచి ఆదేశాలివ్వడం గమనార్హం.

బైక్‌ ర్యాలీలు.. దళితుల ఇళ్లలో భోజనాలు
గ్రామస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కమలనాథులు దృష్టి సారించారు. ఈ నెల 15 నుంచి 28 వరకు రాష్ట్రంలోని 12 వేల గ్రామాల్లో బైక్‌ ర్యాలీ లు నిర్వహించడంతో పాటు ఆయా గ్రామాల్లో రెండు చోట్ల ఉదయం, సాయంత్రం సమావేశాలను ఏర్పా టు చేయనున్నారు. అలాగే ఆయా గ్రామాలకు వెళ్లే పార్టీ రాష్ట్ర, జిల్లా బాధ్యులు గ్రామాల్లోని దళితుల ఇళ్లల్లో భోజనం చేయాలని నిర్ణయించారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంతో పాటు కేంద్రప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌చార్జులను కూడా నియమించే కసరత్తును రాష్ట్ర నాయకత్వం పూర్తి చేసినట్టు సమాచారం. వీరి నియామకంపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉం టుందని, వీరంతా లోక్‌సభ స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీ సమాచారం మేరకు ఇన్‌చార్జులు వీరే!
నిజామాబాద్‌–వెంకటరమణి, ఆదిలాబాద్‌–యెండ ల లక్ష్మీనారాయణ, ఖమ్మం–బండారు దత్తాత్రేయ, వరంగల్‌–బద్దం బాల్‌రెడ్డి, మెదక్‌–రామకృష్ణారెడ్డి, జహీరాబాద్‌–ప్రేమేందర్‌రెడ్డి, కరీంనగర్‌–ధర్మారా వు, నాగర్‌కర్నూల్‌–ఎన్‌.రాంచందర్‌రావు, మహబూబాబాద్‌–పేరాల చంద్రశేఖర్, మహబూబ్‌నగర్‌–జి.మనోహర్‌రెడ్డి, నల్గొండ–జి.కిషన్‌రెడ్డి, మల్కాజ్‌గిరి–నాగూరావు నమోజి, జాజుల గౌరి, చేవెళ్ల–ఆచారి, జనార్దనరెడ్డి, హైదరాబాద్‌–చింతా సాంబమూర్తి, ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి, సికింద్రాబాద్‌–రాజేశ్వరరావు, వి.ఛాయాదేవి, పెద్దపల్లి–ఇంద్రసేనారెడ్డి, ఎస్‌.కుమార్, భువనగిరి–మురళీధర్‌రావు, కడగంచి రమేశ్‌. 

మరిన్ని వార్తలు