ముస్లిం అభ్యర్థులకు బీజేపీ టిక్కెట్లు

6 May, 2018 16:04 IST|Sakshi

కోల్‌కతా : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు కుల, మతాల ప్రతిపాదికన ఓటర్లకు దగ్గరయేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. దానిలో భాగంగానే ముస్లిం వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డ బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో మైనారిటీ అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించింది. బెంగాల్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో 850కి పైగా మైనారిటీ అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. బీజేపీ చరిత్రలోనే ఇంత మొత్తంలో  ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడం ఇదే మొదటిసారి.

రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం ఉన్న ముస్లిం జనాభాకు దగ్గరయేందుకు బీజేపీ మైనారిటీ అభ్యర్ధులకు టిక్కెట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ తెలిపారు. బీజేపీ మైనారిటీలకు టిక్కెట్లు కేటాయించడాన్ని అధికార తృణమూల్‌  కొట్టిపారేసింది. రాష్ట్రంలోని మైనారిటీలకు సీఎం మమత బెనర్జీపై విస్వాసం ఉందని, వారంతా టీఎంసీతోనే ఉంటారని తృణమూల్‌  సీనియర్‌ నేత పార్థ ఛటర్జీ తెలిపారు.

 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ 100 కంటే తక్కువ సీట్లను మైనారిటీలకు కేటాయించగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లలో కేవలం ఆరుగురు ముస్లిం అభ్యర్ధులకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. ముస్లింలు అధికార తృణమూల్‌పై వ్యతిరేకతతో ఉన్నారని, బీజేపీపై వారికి పూర్తి విశ్వాసం ఉందని రాష్ట్ర ముస్లిం మోర్చా అధ్యక్షుడు అలీ హుస్సేన్‌ తెలిపారు.

‘కేంద్రంలో, 20 రాష్ల్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ పాలనలో ముస్లింలు సంతోషంగా ఉన్నారు.  2019లో కూడా మా పార్టీయే అధికారంలోకి వస్తుంది. మా పార్టీ కులం, మత ప్రాతిపాదికన సీట్లు కేటాయించదు. అభ్యర్థుల విజయావకాశాలకు బట్టి టిక్కెట్లు ఇస్తుంది.’ అని దిలీప్‌ ఘోష్‌ అన్నారు. ఇటీవల తృణమూల్‌ నుంచి బీజేపీలోకి వెళ్లిన ముకుల్‌ రాయ్‌ మైనారిటీలకు టిక్కెట్లు కేటాయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. కాగా మే 14న రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియాంక గాంధీని అడ్డుకున్న అధికారులు..!

ప్రతిపక్షం తీరు కుక్కతోక వంకరే: సీఎం జగన్

‘కర్నాటకం’లో కొత్త మలుపు

‘షరతులకు లోబడి లేకపోతే చర్యలు’

‘అప్పటి నుంచి మైండ్‌ మరింత దెబ్బతిన్నట్టుంది’

యడ్యూరప్ప చేతులు జోడించి వేడుకున్నారు కానీ..

పోలవరంపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు

‘అది తప్పుడు ప్రచారం; ప్రజల దృష్టికి తీసుకెళ్లండి’

‘బాబు స్వార్ధం కోసం సభను వాడుకుంటున్నారు’

కర్నాటకం; అసెంబ్లీలోనే భోజనం, నిద్ర

'అధ్యక్షా.. మమ్మల్ని వెనుకబెట్టారు'

‘నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు’

మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి

‘బీజేపీలో ఎప్పుడు చేరేది త్వరలోనే చెబుతా’

కాంగ్రెస్‌లో ‘కంగాళీ’

కర్నాటకం క్లైమాక్స్‌ నేడే

సభ సంకేతాలతో నడుస్తోంది 

నిలబెట్టుకోలేక నిందలా!

కుమారస్వామికి గవర్నర్‌ డెడ్‌లైన్‌

‘సీఎం జగన్‌ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు’

బీజేపీలో నాకు తలుపులు మూసుకుపోలేదు..

బీజేపీలో చేరిన 13 మంది సెలబ్రిటీలు!

కేటీఆర్‌.. మీతో ఛాయ్‌ కా, ఇంకేమైనా ఉందా?

కర్ణాటకం : విశ్వాస పరీక్ష రేపటికి వాయిదా

కర్ణాటకం : గవర్నర్‌ సూచనతో మారిన సీన్‌

4 వేల కి.మీ.; మరో వారసుడి ప్రజాయాత్ర!

కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం

కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా

సీఎం జగన్‌పై లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ సభ్యుల నిరసన; కేసీఆర్‌ స‍్పందన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం