కశ్మీర్‌లో తొలి బీజేపీ సర్కారు?

12 Jul, 2018 02:38 IST|Sakshi

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: మెహబూబా ముఫ్తీ రాజీనామా తర్వాత కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. కశ్మీర్‌ మాజీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేత నిర్మల్‌ సింగ్, ప్రధాని మోదీలు బుధవారం ప్రధాని కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. నిర్మల్‌ సింగ్‌తో భేటీకి ముందు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్, పార్టీ జాతీయ కార్యదర్శి రామ్‌మాధవ్‌తోనూ మోదీ సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

ఈ నేపథ్యంలో పీడీపీ రెబల్స్, ఇతర పార్టీల చీలిక వర్గం ఎమ్మెల్యేలతో కలిసి తొలిసారి కశ్మీర్‌లో హిందువును సీఎంగా నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. వారం రోజుల క్రితమే కశ్మీర్‌లో బీజేపీ సర్కారు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. ఢిల్లీ, శ్రీనగర్‌లోని బీజేపీ నేతల మధ్య  చర్చలు జరుగుతున్న విషయం సుస్పష్టమే. రామ్‌మాధవ్, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సజ్జద్‌ లోనీతో సమావేశమవడం, తర్వాత లోనే ఢిల్లీకి వచ్చి మోదీతో భేటీ కావడం తెల్సిందే.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అధిష్టానంతో మాట్లాడాకే రాజీనామా చేస్తా

నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు

కేంద్ర నిధులు తిని మోదీని తిడతారా?

త్యాగం తప్పట..వంచనే ఒప్పట!!

సీట్ల పంపకంపై అమిత్‌ షా, నితీశ్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌

రిపోర్టర్‌ యాక్షన్‌

థ్రిల్లర్‌ లవ్‌స్టోరీ

చిన్న సినిమాలను ప్రోత్సహించాలి

అప్పుడు ఆలియా చిన్నపిల్ల

దోచుకోవాలని...