మిమ్మల్ని టచ్‌ చేయాలంటే నన్ను దాటాలి!

21 Sep, 2019 09:20 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో జాతీయ పౌరజాబితా (ఎన్నార్సీ)ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. బెంగాల్‌ ప్రజలను బీజేపీ టచ్‌ చేయాలనుకుంటే.. తనను దాటాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లు చేర్చుకోవాలని ఆమె సూచించారు. బెంగాల్‌లో ఎన్నార్సీని తెస్తామని స్థానిక బీజేపీ నేతలు వందతులు ప్రచారం చేస్తున్నారని మమత మండిపడ్డారు. 

‘బెంగాల్‌ ప్రజలు ఎంలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు నాపై విశ్వాసం ఉంచండి.  బెంగాల్‌ నుంచి ఎవరూ వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లు నివసిస్తున్న మీరు ఇక్కడ ఉండొచ్చు. వాళ్లు మిమ్మల్ని టచ్‌ చేయాలనుకుంటే.. నన్ను దాటి రావాల్సి ఉంటుంది’ అని మమత స్పష్టం చేశారు. ఎన్నార్సీ అసోంకే పరిమితం అవుతుందని, అసోంలో ఎన్నార్సీ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలను ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి వివరించానని ఆమె తెలిపారు. 
 

>
మరిన్ని వార్తలు