తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ  

17 Nov, 2017 22:10 IST|Sakshi

 బరిలోకి దిగనున్న 70 మంది అభ్యర్థులు   

న్యూఢిల్లీ: గుజరాత్‌ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 70 మంది అభ్యర్థుల తొలిజాబితాను బీజేపీ గురువారం విడుదల చేసింది. ఇందులో ఐదుగురు కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు కాగా 49 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలున్నారు. ఈ జాబితాలో 16 కొత్తముఖాలున్నాయి. ఈ శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్య 182. ఈ జాబితా ప్రకారం పశ్చిమ రాజ్‌కోట్‌ నుంచి ముకుల్‌రాయ్, మహెసేన నియోజకవర్గం నుంచి ఉపముఖ్యమంత్రి నితిన్‌భాయ్‌ పటేల్,.. పశ్చిమభావ్‌నగర్‌ నుంచి, పార్టీ రాష్క్రశాఖ అధ్యక్షుడు జీతూభాయ్‌ వాఘాని పోటి చేస్తారు. 

ఈ 70 మందిలో 17మంది పటేళ్లు, 18 మంది ఓబీసీలు, ముగ్గురు ఎస్సీలు, 11 మంది ఎస్టీలున్నారు. బుధవారం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ జాబితాను ఖరారుచేసింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, హోం శాఖ సహాయమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ తదితరులు పాల్గొనడం తెలిసిందే. గుజరాత్‌ శాసనసభ ఎన్నికలు డిసెంబర్‌ 9, 14 తేదీల్లో జరగనున్నాయి.  

మరిన్ని వార్తలు