నేను కూడా కాపలాదారుడినే..!

16 Mar, 2019 14:32 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి కౌంటర్‌ ఇస్తూ.. బీజేపీ సరికొత్త ప్రచారానన్ని ప్రారంభించింది. ‘చోకీదార్‌ చోర్‌ హై’ అంటూ కాంగ్రెస్‌​పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ.. ‘మై భీ చోకీదార్‌ హై’ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తూ ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. ‘కాపలాదారుడు దృఢనిశ్చయంతో దేశానికి సేవ చేస్తున్నాడు. నేను ఒంటరిని కాదు. అవినీతి, సామాజిక దురాచారాలు, అపరిశుభ్రతపై పోరాడుతున్న ప్రతి ఒక్కరూ కాపలాదారులే. దేశ పురోగతి కోసం ప్రతి ఒక్కరూ కాపలాదారుడిలా తీవ్రంగా శ్రమిస్తున్నారు’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. దీనికి మై భీ చోకీదార్‌ హై హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

సామాజిక దురాచాలు, అవినీతిపై పోరాడేవారు ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ప్రచారంలో భాగం కావొచ్చునని బీజేపీ పిలుపునిచ్చింది. రఫేల్‌ కుంభకోణంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. ప్రధాని మోదీని కాపలాదారుడే దొంగలా మారిపోయాదని పలుసార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ ‘చోకీదార్‌ చోర్‌ హై’  దాడికి ప్రతిగా ‘మై భీ చోకీదార్‌ హై’ ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది.

మరిన్ని వార్తలు