ప్రజల ఓపిక నశిస్తోంది : లక్ష్మణ్‌

25 Sep, 2019 01:45 IST|Sakshi

వారు తిరగబడితే ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు

మీడియా చిట్‌చాట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజల ఓపిక నశిస్తోందని, ప్రజలు తిరగబడితే ఎన్నికలు ఎప్పుడైనా జరుగవచ్చని, ముందస్తు రావచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. తాము మాత్రం ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉండాలనే అనుకుంటున్నామని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ కోర్‌ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వతీరుతో ప్రజలు విసిగిపోయారని, బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదులుకోదని, అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు. హుజూర్‌నగర్‌ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటామన్నారు. అక్కడి టీఆర్‌ఎస్‌ నాయకత్వంపై కేసీఆర్‌కు నమ్మకంలేకనే మంత్రులను, ఎమ్మెల్యేలను ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తున్నారని ఎద్దేవా చేశారు.  

బీజేపీ భయంతోనే కేబినెట్‌ విస్తరణ.. 
హుజుర్‌నగర్‌లో తమకు 12 వేల సభ్యత్వం ఉంద ని లక్ష్మణ్‌ అన్నారు. హుజుర్‌నగర్‌ టికెట్‌ కోసం రామకృష్ణ, జైపాల్‌రెడ్డి, రవీంద్రనాయక్, రాంమోహన్‌ రెడ్డి, శ్రీకళారెడ్డి, భాగ్యరెడ్డి తదితరులు టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. శంకరమ్మ తమను కలవలేదని, ఆమె టీఆర్‌ఎస్‌లో ఉందని పేర్కొన్నారు. ఆమె బయటకు వచ్చి తమను కలిస్తే తప్పకుండా ఆశ్రయం కల్పిస్తామన్నారు. హుజూర్‌నగర్‌లో కేసీఆర్‌ డబ్బుతో గెలువాలని చూస్తున్నారని, కానీ అక్కడి ప్రజలు దేశభక్తి కలిగిన వారని, బీజేపీని ఆదరిస్తారన్నారు. బీజేపీ భయంతోనే సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ విస్తరణ చేపట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మీడియా కన్వీనర్‌ సుధాకరశర్మ, అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీడీపీ హయాంలో ఒక్క కాంట్రాక్టు అయినా తక్కువకు ఇచ్చారా?

ఉప పోరు హోరు

రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లండి: భట్టి

హుజుర్‌నగర్‌లో త్రిముఖ పోరు

హుజుర్‌నగర్‌లో త్రిముఖ పోరు

‘అది భారత్‌-పాక్‌ విభజన కన్నా కష్టం’

‘నా రాజకీయ జీవితం ముగియబోతోంది’

‘ముఖ్యమంత్రులు కాదు.. ప్రజలు శాశ్వతం’

పోలీసులపై కేంద్రమంత్రి చిందులు

‘శంకరమ్మ మమ్మల్ని సంప్రదించలేదు’

'తప్పుడు రాతలు రాస్తున్న వ్యక్తులను ఉపేక్షించం'

పోలవరం పూర్తి చేస్తే.. మీ పార్టీని మూసేస్తారా?

ఆ పత్రికది విష ప్రచారం

చంద్రబాబువి తోకపత్రిక ఆరోపణలు

బినామీ పేర్లతో జేసీ సోదరులు దోచుకున్నారు

‘చంద్రబాబుకు మతి భ్రమించింది’

హుజూర్‌నగర్‌లో ఉమ్మడి అభ్యర్థే

చట్టప్రకారమే అక్రమ కట్టడాలపై చర్యలు : బొత్స

కాంగ్రెస్‌ జోలికొస్తే వదిలేది లేదు: ఉత్తమ్‌

2023 నాటికి రూ.5 లక్షల కోట్ల అప్పు 

సైదిరెడ్డికి బీఫామ్‌ అందజేసిన కేసీఆర్‌

ఎగిరేది గులాబీ జెండానే

హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కు బుద్ధి చెప్పాలి : కేటీఆర్‌

‘మీరు స్టార్‌ క్యాంపెయినర్‌ కాదు’

‘బరితెగించి ఇంకా అప్పులు చేస్తానంటున్నాడు’

47 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేసిన సీఎం

కశ్మీర్‌పై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన

‘మౌనిక కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షల ఇవ్వాలి’

‘ఆంధ్రజ్యోతికి రూ. 50లక్షలకే భూమి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడవుల్లో వంద రోజులు!

ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సింది

బ్రేకప్‌!

మంచి సినిమాని ప్రోత్సహించాలి

దాదా.. షెహెన్‌షా

కొత్త కథాంశం