4న అమిత్‌షా రోడ్‌ షో

29 Mar, 2019 13:22 IST|Sakshi

పెదవాల్తేరు(విశాఖతూర్పు): వచ్చేనెల నాలుగో తేదీన విశాఖలో జరగనున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రోడ్‌షోను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. లాసన్స్‌బేకాలనీలోని  పార్టీ కార్యాలయంలో వారు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏయే బాధ్యతలు చేపట్టాలో సూచనలు, సలహాలు స్వీకరించారు.  కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి మురళీధర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొం టారని తెలిపారు. రోడ్‌షో విజయవంతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళామోర్చా, యువమోర్చా, ఎస్సీ, ఓబీసీసెల్‌ తదితర అనుబంధ సం ఘాలు కృషి చేయాలని వారు కోరారు.  సమావేశంలో ఎంపీ కె.హరిబాబు, ఎమ్మెల్యే  పి.విష్ణుకుమార్‌రాజు,  ఎమ్మెల్సీ పీవీఎన్‌మాధవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీవిశ్వనాథరాజు, నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు