కేసీఆర్‌ క్వారంటైన్‌ సీఎం

9 May, 2020 03:55 IST|Sakshi

ధైర్యం ఉంటే కొనుగోలు కేంద్రాల్లో పర్యటించాలి : బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్వారంటైన్‌లో ఉన్నారని, పేదలు ఇబ్బందులు పడుతు న్నా ఇంట్లో నుంచి ఆయన బయటకు రారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ విమర్శించారు. జోకర్‌ ముఖ్యమంత్రి, క్వారంటైన్‌ ముఖ్యమంత్రి అన్న పేరు కేసీఆర్‌కు కరెక్ట్‌గా సెట్‌ అవుతుందన్నారు. ఆరేళ్లుగా ఆయన క్వారంటైన్‌లో నే ఉన్నారని, తాను బతికే ఉన్నానని చెప్పేందుకు అప్పుడప్పుడు బయటకు వస్తారని దుయ్యబట్టా రు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆయన మీడియాతో జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లా డారు. ప్రజలను, రైతులను కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. కోటి టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు 20 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే  సేకరించిందన్నారు.

దేశంలో 18 రాష్ట్రాల ప్రభుత్వా లు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయని, కేసీఆర్‌ మాత్రం తాము ధాన్యం సేకరించకుంటే పరిస్థితి ఏంటని రైతులను బెదిరిస్తున్నారన్నారు. కేసీఆర్‌కు దమ్ము, దైర్యం ఉంటే కొనుగోళ్ల కేంద్రాల్లో పర్య టించాలన్నారు. గన్నీ బస్తాలు, రవాణా చార్జీలు ఇలా ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందని, గిడ్డంగుల నిర్మాణం కోసం రూ.464 కోట్లు ఇచ్చిందని తెలి పారు. కరోనా విషయంలో వైద్యులు టెస్టులు చేయండని వేడుకున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని  సం జయ్‌ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు, మరణాలను కేసీఆర్‌ కోరుకుంటున్నారని, ఆయన నిర్ణయాల వల్లే హైదరాబాద్‌లో మళ్లీ కేసులు పెరిగాయని ఆరోపించారు. గత నెలలో కరోనాతో ఒకరు చనిపోయినా ప్రకటించకపోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను దొంగలకు అడ్డాగా మారుస్తున్న ఎంఐఎంకు టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ఇవ్వడం బాధాకరమన్నారు. పాతబస్తీలో దళిత మైనర్‌ బాలికపై అత్యాచారం చేయడం దురదృష్ట కరమని, ఆ ఘటనకు పాల్పడిన ఎంఐఎం వ్యక్తిపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు