టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే: డీకే

20 Apr, 2019 15:59 IST|Sakshi
బీజేపీ నాయకురాలు డీకే అరుణ(పాత చిత్రం)

నల్గొండ జిల్లా: చట్టాల్లో మార్పు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అభిప్రాయపడ్డారు. నల్గొండలో డీకే అరుణ విలేకరులతో మాట్లాడుతూ.. అవినీతి పాల్పడేది రెవెన్యూ అధికారులా లేక టీఆర్‌ఎస్‌ నాయకులా అని పరోక్షంగా ప్రశ్నించారు. ఓటమి భయంతోనే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రాక ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు.

తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌పై జనంలో నమ్మకం పోయిందని, కాంగ్రెస్‌ వారిని గెలిపించినా చివరికి టీఆర్‌ఎస్‌లోనే చేరతారని అన్నారు. దేశమంతా మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు