'కొత్త జిల్లాలతో ఏం సాధించారు'

29 Sep, 2017 16:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఏం సాధించారని బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. కొత్త కలెక్టరేట్‌లు ప్రారంభించి ఏడాది పూరైనా ఇప్పటివరకు నూతన భవనాలు ఎందుకు నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త జిల్లా కార్యాలయాల్లో 50 శాతం మంది స్టాఫ్‌ కూడా లేదు. నాలుగు నెలలుగా పెద్దపల్లి జిల్లాకు కలెక్టర్‌ లేరు అయినా సీఎం పట్టించుకోవడం లేదు. పాలన చేరువ చేయడం కోసం జిల్లాల విభజన అన్న కేసీఆర్‌ సమస్యల పరిష్కారానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు. 

మరిన్ని వార్తలు