కేంద్ర నిధులపై కేటీఆర్‌ చర్చకు సిద్ధమా?

4 Feb, 2020 04:39 IST|Sakshi

బడ్జెట్‌ ఎలా ఉంటుందో కూడా తెలియదా?

ఇచ్చిన నిధుల సంగతి మరిచిపోతున్నారా?

మీ జేబులు నింపడానికి కేంద్రం నిధులు ఇవ్వదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై మంత్రి కేటీఆర్‌తో తాము చర్చకు సిద్ధమని, కేటీఆర్‌ అందుకు సిద్ధమా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ సవాల్‌ విసిరారు. బడ్జెట్‌ ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో సోమవారం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. టీమిండియా స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం అనేక ప థకాలు, కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి ఇతోధికం గా నిధులు మంజూరు చేస్తున్నా కేటీఆర్‌ గజినీలా మారి కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో కేసీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం తెచ్చారో చర్చకు రావాలని కేటీఆర్‌కు ఆయన సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరిస్తారా? అని ప్రశ్నించారు.

రాష్ట్రాలకు మేలుచేసేందుకే: వివిధ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేసే పథకాలు ఆయా రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకే అన్న స్పృహ కేటీఆర్‌కు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కేటీఆర్‌ జేబులు నింపేందుకో, ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు నొక్కేందుకో బడ్జెట్‌ ఉం డదని ఆయన గ్రహిస్తే మంచిదన్నారు. భారీ ప్రాజెక్టులు, వాటిపై వ చ్చే కమీషన్లు తప్పితే సంపద సృష్టి, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి లేదన్నారు. కేసీఆర్‌ మంత్రిగా కొనసాగిన యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం 10 రెట్లు ఎక్కువగా కేంద్ర పన్నులను రాష్ట్రానికి ఇచ్చిందనీ, ప్రత్యేక సహాయం కింద 4 రెట్లు అధికంగా నిధులు అందించిందన్నారు.

కాళేశ్వరంపై డీపీఆర్‌ సమర్పించలేదేం..: విభజన చట్టంలో కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రస్తావనే లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించా లని కేంద్ర ప్రభుత్వం కోరినా ఇంతవరకు ఇవ్వలే దని వెల్లడించారు. డీపీఆర్‌ను సమర్పిస్తే తమ అవి నీతి అక్రమాలన్నీ బయటపడిపోతాయనేది వారి భయమనీ, రూ.లక్ష కోట్ల పనులకు టెండర్లు పిలవకుండా నామినేషన్లపై నంజుకుని తినేశారని ఆరోపించారు. ఆ కమిషన్లతోనే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌ నీతి తుక్కుగుడా, నేరేడు చెర్ల, నిజామాబాద్‌లలో ఎక్కడి పోయిందని లక్ష్మణ్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు