‘అలా అనుకుంటే ఆశాభంగం తప్పదు’

9 Sep, 2019 17:37 IST|Sakshi

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు

సాక్షి, విశాఖపట్నం: ఆర్టికల్‌ 370 రద్దు చారిత్రక నిర్ణయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు.విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..370 రద్దుతో బడుగువర్గాల ప్రజలే ఎక్కువగా లబ్ధిపొందారని వెల్లడించారు. రాజకీయాలను కుటుంబ రాజకీయాలుగా కాంగ్రెస్‌ మార్చేసిందని విమర్శించారు. దేశాభివృద్ధి, ఐ‍క్యత విషయంలో బీజేపీ ఏ మాత్రం లాలూచీ పడదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరినవారు కేసుల నుంచి రక్షింపబడతారని అనుకుంటే వారికి ఆశాభంగం తప్పదని మురళీధర్‌రావు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు