వాళ్లతో కాంగ్రెస్‌ భ్రష్టుపట్టింది: పొంగులేటి

14 May, 2019 18:57 IST|Sakshi

హైదరాబాద్‌: తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ఉదంతాలను కాంగ్రెస్‌ కార్యకర్తలెవరూ మరచిపోలేదని, అట్లాంటి తీవ్రవాద వ్యతిరేక నినాదంతో ముందుకెళ్లిన కాంగ్రెస్‌.. ఇటీవల కాలంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీవ్రవాదులకు మద్ధతు తెలుపుతుందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. హింసావాదంపై అవకాశవాద వ్యాఖ్యలు చేస్తోన్న కాంగ్రెస్‌ నాయకుల తీరుతో పార్టీ భ్రష్టు పట్టిపోయిందని మండిపడ్డారు. పుల్వామా దాడి తర్వాత యావత్‌ భారతదేశం పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటే.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మాత్రం పాకిస్తాన్‌కు వత్తాసు పలికే విధంగా అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టించారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ కారణం చేతనే తాను కాంగ్రెస్‌ పార్టీని వీడాల్సి వచ్చిందని పొంగులేటి పేర్కొన్నారు.

‘నేను కాంగ్రెస్‌ పార్టీని వీడే సమయంలో కూడా పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి రాసిన లేఖలో కాంగ్రెస్‌ మేధావులమని చెప్పుకునే కొందరు నేతల అహంకారపూరిత, బాధ్యతారహితమైన వ్యాఖ్యల వల్ల పార్టీ పేరు మంట గలుస్తోందని, వారి అదుపులో ఉంచాలని హెచ్చరించాను.కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న ఆక్రోశంతో, ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మతి భ్రమించిన విధంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్‌ అపరమేధావి శామ్‌ పిట్రోడా, సిక్కుల ఊచకోతకు సంబంధించి ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేశారో.. అవి ఎంత దుమారం రేపాయో చూశాం. శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు సిగ్గు పడాలని, ఆయన సిక్కులకు క్షమాపణ చెప్పాలని రాహుల్‌ కంటి తుడుపుగా ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. కానీ రాహుల్‌కు చిత్తశుద్ధి ఉంటే పిట్రోడాను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలి. అలా చేయని పక్షంలో సిక్కులు ఎన్నటికీ కాంగ్రెస్‌ను క్షమించర’ని పొంగులేటి వ్యాఖ్యానించారు.

‘నేను ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. ఏ రాష్ట్రానికి వెళ్లినా మోదీ ప్రభంజనమే కనిపిస్తోంది. మోదీకి సాటిగా నిలబడగలిగే నేత లేకపోవడం వల్ల ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి నేతలంతా తాము కూడా ప్రధాని పదవి రేసులో ఉన్నామని చెప్పుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. అరచేతితో సూర్యుడి వెలుతురును ఆపలేరు. అనామక పార్టీలన్నీ ఏకమై కూటమిగా ఏర్పడినా మోదీ ప్రధాని కావడాన్ని అడ్డుకోలేవ’ని అన్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రతిపక్షంగా మంచి సూచనలు చేయండి

ఏపీ ఎంపీల ప్రమాణ స్వీకారం

అభివృద్ధి, సంక్షేమాలే గెలిపించవు 

నమ్మకంగా ముంచేశారా?

ఆ తనిఖీతో మాకేంటి సంబంధం?

ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగాన్ని అవమానించారు

బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నడ్డా

ఐదేళ్లలో మీరు చేసిందేమిటి?

మీ సూచనలు అమూల్యం

‘రెండు సీట్లకూ ఒకేసారి ఉపఎన్నికలు పెట్టండి’ 

గోదావరి జలాలతో తెలుగు నేల తడవాలి

సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ప్రమాణంపై వివాదం..

అచ్చెన్నాయుడు ఇంకా మారలేదు: శ్రీకాంత్ రెడ్డి

బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా

హస్తినలో రాజగోపాల్‌రెడ్డి.. కీలక వ్యాఖ్యలు

లోకేశ్‌ దుష్ప్రచారం చేస్తున్నారు: హోంమం‍త్రి సుచరిత

అవినీతి రహిత పాలనను అందిస్తాం: డిప్యూటి సీఎం

రాజగోపాల్‌రెడ్డి ఏం మాట్లాడాడో నేను చెప్పను..

ఎంపీగా రాహుల్‌ గాంధీ ప్రమాణం

ఆందోళనను విరమించనున్న జూడాలు!

‘ఆ వ్యాఖ్యలకు పార్లమెంట్‌ వేదిక కాదు’

రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్‌?

ఏపీకి టార్చ్‌ బేరర్‌ దొరికారు: రోజా

సీఎం జగన్‌ నివాసానికి కేసీఆర్‌

బీజేపీలో చేరికకు టీడీపీ నేతల ఆసక్తి

యోగికి ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

దుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్‌

హిందీలో తెలుగు ఎంపీల ప్రమాణం

శాసనమండలికి తొలిసారి వైఎస్‌ జగన్‌

ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సగం పెళ్లి అయిపోయిందా?

ప్రయాణం మొదలు

గురువుతో నాలుగోసారి

పచ్చడి తిని ఆఫీసుకెళ్లారు

రాజా నరసింహా

ఆ నమ్మకంతోనే కల్కి విడుదల చేస్తున్నాం