‘ప్రజాస్వామ్యం ​గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు’

19 May, 2018 16:48 IST|Sakshi
శ్యామ్‌ కిషోర్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, విజయవాడ: కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదంటూ బీజేపీ నేతలు లక్ష్మీపతి రాజా, జమ్మల శ్యామ్‌ కిషోర్‌ తీవ్ర స్థాయలో విమర్శించారు.

‘వైఎస్సార్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకున్నప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి బలవంతంగా అధికారం లాక్కున్నపుడు ఎక్కడికి వెళ్ళింది ప్రజాస్వామ్యం. ముందు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తరువాత చంద్రబాబు ప్రజాస్వామ్య విలువల గురించి మట్లాడాలి. రాజకీయ జీవితం ఇచ్చిన ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించినప్పుడు ఎక్కడికి వెళ్ళింది చం‍ద్రబాబు ప్రజాస్వామ్యం​. నిండు శాసన సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్‌ కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం. మేము అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పి తరువాత చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలి’ అని బీజేపీ నేతలు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.

మరిన్ని వార్తలు