‘ఐటీ దాడులు.. ఉలిక్కిపడ్డ టీడీపీ’

6 Oct, 2018 13:36 IST|Sakshi

టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ

చంద్రబాబు ముఖ్యమంత్రా లేక ముఖ్య కంత్రా: జీవిఎల్‌

సాక్షి, ఏలూరు: ఏపీలో కొంతమంది పన్ను ఎగవేతదారులపై ఐటీ దాడులు జరిగితే తెలుగు దొంగల పార్టీ ఉలిక్కిపడిందని ఎద్దేవా బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవిఎల్‌ సరసింహా రావు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ‘ప్రజా ఆవేదన ధర్నా’లో ఆయన మాట్లాడుతూ... ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ప్రజల సమస్యల గురించి ఏనాడు కేబినెట్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయలేదని.. కానీ ఐటీ దాడుల నేపథ్యంలో ఏం చేయాలని మీటింగ్‌ పెట్టడం సిగ్గుచేటన్నారు. నిన్న జరిగిన అత్యవసర సమావేశం మాఫియా మీటింగ్‌లా ఉందని దుయ్యబట్టారు. టీడీపీ అంటే రాజకీయ పార్టీనా లేక మాఫియా పార్టీనా అంటూ ప్రశ్నించారు. అవినీతిలో ప్రపంచంలోనే టీడీపీ అగ్రస్థానంలో ఉందని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రా లేక ముఖ్య‘కంత్రి’నా అంటూ ఎగతాళి చేశారు. ఎంత దొరికితే అంత దోచుకుందాం.. దొరక్కుండా పారిపోదాం అన్నట్టు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. (ఐటీ సోదాలంటే ‘నిప్పు’ గజగజ!)

‘మోసానికి కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు’
మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ ‘గత ఎన్నికల్లో అనుభవజ్ఞడని, అభివృద్ది చేస్తారని చంద్రబాబును నమ్మి ప్రజలు ఓటేశారు.. కానీ ఆ నమ్మకాన్ని  ఆయన నిలబెట్టుకోలేకపోయారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. ఏపీలో రైతులు అప్పుల్లో కూరుకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేయలేదా? ఏపీకి కేంద్రం సహాయ సహకారాలు అందించటం లేదని టీడీపీ విమర్శలు చేయడం దారుణం. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే సరైన బుద్ధి చెప్పాలి’ అంటూ పిలుపునిచ్చారు. 

చదవండి:

ఐటీ అధికారుల సెక్యూరిటీ విత్‌డ్రా చేసుకుంటాం: చంద్రబాబు

ఇంత వణుకెందుకో?

మరిన్ని వార్తలు